Header Banner

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

  Sun Feb 16, 2025 13:00        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు భారీ షాక్ ఇచ్చారు. భారత్‌లో ఓటరు శాతాన్ని పెంచేందుకు ఇప్పటి వరకు అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.182 కోట్లు) సాయాన్ని నిలిపివేశారు. ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సారథ్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ (డీవోజీఈ) తాజాగా ప్రకటించింది. అలాగే, బంగ్లాదేశ్‌ను రాజకీయంగా బలోపేతం చేసే లక్ష్యంతో కేటాయిస్తున్న 29 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 251 కోట్లు) సాయాన్ని కూడా నిలిపివేసింది. అంతర్జాతీయ సాయంలో విస్తృతంగా విధిస్తున్న కోతల్లో భాగంగానే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్, బంగ్లాదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఈ గ్రాంట్‌ను అందిస్తోంది. డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమైన కొన్ని రోజులకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బడ్జెట్‌లో కోతలు లేకపోతే అమెరికా దివాలా తీస్తుందని మస్క్ ఇటీవల పలుమార్లు నొక్కి చెప్పారు. ఇప్పుడు బడ్జెట్‌లో కోత విధించడం ద్వారా భారత్, బంగ్లాదేశ్‌కు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.  అమెరికా తాజా నిర్ణయంతో మరికొన్ని దేశాలకు కూడా సాయం నిలిచిపోనుంది.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli